టీసీఎస్ లాభం రూ.13 వేల 349 కోట్లు.. మొత్తం ఆదాయం రూ.72 వేల 275 కోట్లు

టీసీఎస్ లాభం రూ.13 వేల 349 కోట్లు.. మొత్తం ఆదాయం రూ.72 వేల 275 కోట్లు

న్యూఢిల్లీ: భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్​నికరలాభం 2026 జూన్ క్వార్టర్లో 4.61 శాతం వృద్ధి చెంది రూ.13,349 కోట్లకు చేరింది. కంపెనీ మొత్తం ఆదాయం దాదాపు 14 శాతం వృద్ధితో రూ.72,275 కోట్లకు పెరిగింది.  ఏఐ విభాగం ఆదాయం 2.6 బిలియన్ డాలర్లు ఉంది. ఈ క్వార్టర్లోలో టీసీఎస్ 9.5 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను దక్కించుకుంది. ఇందులో ఎస్కేఎఫ్ కంపెనీతో కుదుర్చుకున్న 800 మిలియన్ డాలర్ల భారీ ఏఐ ఒప్పందమూ ఉంది.  

ఏఐ విస్తరణ కోసం ఆంత్రోపిక్ , మిస్ట్రాల్ సంస్థలతో చేతులు కలిపింది. జీతాల పెంపు , కొత్త పెట్టుబడుల కారణంగా ఏప్రిల్ నుంచి జూన్ కాలంలో కంపెనీ కార్యాచరణ లాభాల మార్జిన్ 24 శాతానికి పరిమితమైంది. ఈ మూడు నెలల్లో టీసీఎస్ కొత్తగా 9,200 మంది ఉద్యోగులను చేర్చుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 5,93,798 కి చేరింది.  ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్​) 13.6 శాతంగా ఉంది. 

వినియోగదారుల విభాగం మినహా మిగిలిన అన్ని రంగాలూ వృద్ధిని కనబరిచాయి. గతంలో బీఎస్ఎన్ఎల్ ఒప్పందం ముగియడంతో తగ్గిన భారతీయ మార్కెట్ ఆదాయం ఈసారి ఏడాది ప్రాతిపదికన 22.9 శాతం మేర పెరిగింది.  ఈ సందర్భంగా టీసీఎస్​ సీఈఓ కృతి వాసన్​ మాట్లాడుతూ ఏఐ కారణంగా ఉద్యోగులను తొలగించబోమని, ఏఐ నేటివ్​ స్కిల్స్​ ఉన్న నిపుణులకే అవకాశాలు ఇస్తున్నామని తెలిపారు.