భద్రాచలం,వెలుగు: దేశంలో అంతరాల్లేని సమాజ స్థాపనే కమ్యూనిస్టుల లక్ష్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సీపీఐ ఉమ్మడి జిల్లా మూడు రోజుల శిక్షణా తరగతుల్లో గురువారం ఆయన పాల్గొని మాట్లాడారు.
దేశంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని, అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కమ్యూనిస్టుల వైపు ఆకర్షితులౌతున్నారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి సీపీఐ నిర్ధిష్టమైన కార్యచరణను రూపొందించిందని ప్రకటించారు.
గుడిసెకు పట్టా, ప్రతీ పేదవానికి ఇల్లు అనే లక్ష్యం, కార్పొరేట్ వైద్య దోపిడీ, రైతుల సమస్యలపై పోరాటం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పడుతూ, లేస్తూ నడుస్తోందని చెప్పారు. పార్టీ బలోపేతానికి సమగ్ర కార్యచరణ చేపట్టాలని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు అన్నారు.
