గోదావరి కరకట్టల పరిశీలన.. పోలవరం బ్యాక్ వాటర్తో భద్రాచలానికి ముప్పు తీవ్రత

గోదావరి కరకట్టల పరిశీలన.. పోలవరం బ్యాక్ వాటర్తో భద్రాచలానికి ముప్పు తీవ్రత

భద్రాచలం, వెలుగు : పోలవరం బ్యాక్​వాటర్​కారణంగా భద్రాచలం పట్టణానికి కలిగే ముప్పు తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర జలశక్తి సంఘం ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్​నిపుణుల కమిటీ గురువారం భద్రాచలంలో పర్యటించింది. తెలంగాణకు చెందిన ఇరిగేషన్​ఈఈ సయ్యద్​అహ్మద్, ఏపీకి చెందిన ఇరిగేషన్ ఈఈ దామోదర్, ఏఈఈ స్రవంతి టీమ్ తెలంగాణ, ఏపీ బార్డర్ లోని భద్రాచలం, ఎటపాక మండలాల్లో పర్యటించి గోదావరి కరకట్టల పరిస్థితిని పరిశీలించారు.

 ఈ సందర్భంగా కరకట్టల స్లూయిజ్ల సామర్థ్యాన్ని భద్రాచలం ఇరిగేషన్ ఈఈ సయ్యద్​అహ్మద్ వివరించారు. కరకట్టను బలోపేతం చేయడంతో పాటు స్లూయిజ్ ల వద్ద అత్యంత శక్తివంతమైన మోటార్లు ఏర్పాటు చేయడం, పట్టణంలోనికి  ప్రవేశించే నీటిని ఎప్పటికప్పుడు తోడేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. చేపట్టాల్సిన పనులపై రిపోర్ట్ ను తయారు చేసి సీడబ్ల్యూసీకి పంపించనున్నట్లు నిపుణుల కమిటీ పేర్కొంది. అంతకు ముందు ఐటీసీ పీఎస్​పీడీ ఫ్యాక్టరీ గెస్ట్ హౌజ్ లో ఇంజినీరింగ్​నిపుణుల కమిటీ భేటీ అయ్యింది.