ఉప్పల్ స్టేడియంలో టీజీ 20 లీగ్లో గురువారం ఫోర్లు, సిక్సర్ల వర్షమే కాదు.. అచ్చమైన తెలంగాణ సాంస్కృతిక వైభవం వెల్లివిరిసింది. ‘క్రికెట్ మీట్స్ కల్చర్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒగ్గుడోలు, డప్పుల ప్రదర్శన ఆకట్టుకుంది. సింగర్లు మధుప్రియ, భోలే శావలి, హన్మంతు, మౌనికా యాదవ్, స్వప్న, శిరీష తమ పాటలతో ఉర్రూతలూగించారు.
కరీంనగర్ డైమండ్స్, రంగారెడ్డి రైజర్స్ మధ్య మ్యాచ్ జరగ్గా కరీంనగర్ డైమండ్స్ 75 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి క్వాలిఫయర్-2కు దూసుకెళ్లింది. కరీంనగర్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ 61 బంతుల్లో137 పరుగులు చేసి ఔరా అనిపించాడు.
- హైదరాబాద్ సిటీ, వెలుగు
