గనుల్లో పకడ్బందీ రక్షణ చర్యలు తీసుకోవాలి : డైరెక్టర్జనరల్(మైన్స్ సేఫ్టీ) సాగేశ్ కుమార్

గనుల్లో పకడ్బందీ రక్షణ చర్యలు తీసుకోవాలి :  డైరెక్టర్జనరల్(మైన్స్ సేఫ్టీ) సాగేశ్ కుమార్

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి బొగ్గు గనుల్లోని పనిస్థలాల్లో పకడ్బందీ రక్షణ చర్యలు తీసుకోవాలని, డ్యూటీ టైమ్​లో అప్రమత్తంగా వ్యవహరించాలని డైరెక్టర్​జనరల్​(మైన్స్​ సేఫ్టీ) సాగేశ్ ​కుమార్​సూచించారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కాసిపేట-1 బొగ్గు గనిని డీడీఎంఎస్​దీపక్​ కుమార్, ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ, బెల్లంపల్లి రీజియన్ ​సేఫ్టీ జీఎం రఘుకుమార్​తో కలిసి ఆయన సందర్శించారు. 

ఈ సందర్భంగా గనిలోకి దిగి పనిస్థలాల్లో కార్మికుల కల్పిస్తున్న రక్షణ చర్యలు, వసతులను తనిఖీ చేశారు. కార్మికులతో పలు అంశాలపై చర్చించారు. ప్రమాదరహిత సింగరేణిగా మార్చేందుకు అందరు కృషి చేయాలన్నారు. అనంతరం గని ఆఫీస్​లోని రికార్డులను పరిశీలించారు. ఏజెంట్​అబ్దుల్​ ఖాదిర్, గని మేనేజర్​ సతీశ్, ఏరియా ఇంజనీర్ మాధవ్, సేఫ్టీ ఆఫీసర్​సురేశ్, డిప్యూటీ మేనేజర్ వెంకటేశ్, సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీషాన్ తదితరులు పాల్గొన్నారు.