సింగరేణి ఏరియా ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్

సింగరేణి ఏరియా ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
  •     ఆస్పత్రి చరిత్రలో తొలిసారి  రోగికి హిప్ ​రీప్లేస్​మెంట్​

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో గురువారం ఓ కార్మికుడి కుటుంబసభ్యుడికి అరుదైన హిప్​(తుంటిబాల్) రీప్లేస్​మెంట్​ ఆపరేషన్​ను డాక్టర్లు విజయవంతంగా నిర్వహించారు. శ్రీరాంపూర్​ ఏరియాలోని ఆర్కే న్యూటెక్​ బొగ్గు గనిలో జనరల్​ మజ్దూర్​గా పనిచేస్తున్న శ్రీనివాస్ తండ్రి ఐలయ్య కొంతకాలంగా తుంటిభాగంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాడు. అతడిని ఆసుప్రతిలో చేర్పించగా సింగరేణి డీవైసీఎంవో డాక్టర్ మధుకుమార్​ నేతృత్వంలో ఆర్థోపెడిక్ వైద్య బృందం ఆపరేషన్ సక్సెస్​ఫుగా ​చేశారు. 

ఇటీవల ఆస్పత్రిలో టోటల్ నీ రీప్లేస్‌‌మెంట్ ఆపరేషన్​ను కూడా చేపట్టి సింగరేణి వ్యాప్తంగా మన్ననలు పొందారు.​ సింగరేణి ఏరియా ఆస్పత్రి చరిత్రలో వరుసగా రెండు అరుదైన ఆర్థోపెడిక్​ ఆపరేషన్లను విజయవంతంగా చేసిన వైద్యాధికారి, వైద్యులు, సిబ్బందిని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, సింగరేణి ఛీప్​మెడికల్​ ఆఫీసర్​(సీఎంవో) డాక్టర్​ కిరణ్​రాజ్​, కార్పొరేట్​ఆఫీసర్లు​ అభినందించారు. సింగరేణి ఆస్పత్రుల్లో కార్మిక కుటుంబాలకు కార్పొరేట్​స్థాయి వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు.