కోల్బెల్ట్: గుడుంబా అమ్మకాలను అరికట్టాలి...ఎక్సైజ్ ఆఫీసర్లు పట్టించుకోవడంలేదని ఫైర్

కోల్బెల్ట్: గుడుంబా  అమ్మకాలను అరికట్టాలి...ఎక్సైజ్ ఆఫీసర్లు పట్టించుకోవడంలేదని ఫైర్

కోల్​బెల్ట్, వెలుగు: తమ ఏరియాలో యథేచ్చగా సాగుతున్న గుడుంబా అమ్మకాలను అరికట్టాలని మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని దొరలబంగ్లా కాలనీవాసులు డిమాండ్​ చేశారు. గురువారం వారు కోల్​బెల్ట్​హైవే వద్ద నిరసన వ్యక్తం చేశారు. దొరలబంగ్లా ఏరియాలో ఎన్నో ఏండ్లుగా గుడుంబా అమ్మకాలు జరుగుతున్నాయని, అరికట్టాలని ఎన్నిసార్లు ఎక్సైజ్​ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. 

గుడుంబా వ్యసనంతో గడిచిన రెండేండ్లలో కాలనీకి చెందిన 15 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని, వారిపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డునపడ్డాయన్నారు. గుడుంబా విక్రయాలను ప్రోత్సహిస్తున్నవారిపై చర్యలు తీసుకోవా లని డిమాండ్​ చేశారు. ఇప్పటికైనా అబ్కారీ శాఖ స్పందించి దాడులు చేసి అమ్మకాలను  నిలిపివేయాలని కోరారు.