కోల్పోయిన భూమికి సమానంగా భూమి ఇవ్వాలి..కలెక్టర్ సమావేశంలో తనగల రైతుల డిమాండ్

కోల్పోయిన భూమికి సమానంగా భూమి ఇవ్వాలి..కలెక్టర్ సమావేశంలో తనగల రైతుల డిమాండ్
  • మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులు

గద్వాల, వెలుగు: మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు పరిహారంగా భూమికి సమానంగా భూమి ఇవ్వాలని, లేదా ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని వడ్డేపల్లి మండలం తనగల గ్రామ రైతులు డిమాండ్ చేశారు. 

గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌‌లో నిర్వహించిన భూసేకరణ సమీక్షా సమావేశంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ రైతులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం పరిహారంతో పాటు రిజర్వాయర్‌‌లో చేపల వేట హక్కులు కల్పిస్తామని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సహకరిస్తామని, అందుకు భూ సర్వేకు సహకరించాలని కలెక్టర్ కోరారు. 

రైతుల విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పెంచాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించడంతో పాటు, వావిలాల గ్రామానికి చెందిన విద్యార్థి లెనిన్ కుమార్ కు ల్యాప్‌‌టాప్ అందజేశారు.