గ్రాండ్గా మంత్రి సీతక్క బర్త్ డే

గ్రాండ్గా మంత్రి సీతక్క బర్త్  డే

ములుగు/తాడ్వాయి, వెలుగు: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పుట్టిన రోజు వేడుకలు ములుగు జిల్లాలో గురువారం ఘనంగా జరిగాయి. కాంగ్రెస్​శ్రేణులతోపాటు గెజిటెడ్​ ఆఫీసర్స్​ అసోసియేషన్, మున్సిపాలిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంత్రి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టర్​ బోర్ఖడే హేమంత్​ సహదేవరావు క్యాంపు ఆఫీస్‌‌లో మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 

డీఎల్ఆర్​ ఫంక్షన్ హాల్‌‌లో కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్​ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క కేక్​ కట్ చేశారు. అనంతరం సర్పంచ్, కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో గెజిటెడ్​ఆఫీసర్స్​అసోసియేషన్​ ఆధ్వర్యంలో అడిషనల్‌‌ కలెక్టర్​సంపత్​ రావు సీతక్కను సత్కరించారు. ములుగు మున్సిపల్‌‌ కమిషనర్​ జె.సంపత్​ రెడ్డి ఆధ్వర్యంలో బండారుపల్లి రోడ్డులోని డివైడర్‌‌‌‌లో మొక్కలు నాటారు. 

తాడ్వాయిలోని కాంగ్రెస్‌‌ పార్టీ ఆఫీస్‌‌లో మాజీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్‌‌‌‌ ఆధ్వర్యంలో కేక్‌‌ కట్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్​కమిటీ చైర్‌‌‌‌పర్సన్‌‌ రేగ కల్యాణి, లైబ్రరీ సంస్థ చైర్మన్​ బానోతు రవిచందర్, మున్సిపల్‌‌ చైర్‌‌‌‌పర్సన్​ చింతనిప్పుల చంద్రకళ, వైస్​చైర్‌‌‌‌పర్సన్‌‌ ఆసియా మిర్జా, కౌన్సిలర్లు, మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్‌‌‌‌పర్సన్‌‌ ఇర్ప సుకన్య, సర్పంచ్ పీరీల భారతి పాల్గొన్నారు.