మహబూబాబాద్, వెలుగు: పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్ అన్నారు. గురువారం మహబూబాబాద్జిల్లా డోర్నకల్పట్టణ కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు.
హాస్పిటల్ రికార్డులు, మందుల నిల్వలను పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలన్నారు.
14 ఏండ్లు నిండిన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తప్పకుండా ఇప్పించాలని కోరారు. ప్రభుత్వ హాస్పిటల్‌లోనే సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో బి.రవిరాథోడ్, పీహెచ్‌సీ డాక్టర్ సాత్విజ, ఆశ, సిబ్బంది పాల్గొన్నారు
