నారాయణఖేడ్ను ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తాం.. టాటా భాగస్వామ్యంతో 64 నియోజకవర్గాల్లో ఏటీసీ సెంటర్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి

నారాయణఖేడ్ను ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తాం.. టాటా భాగస్వామ్యంతో 64 నియోజకవర్గాల్లో ఏటీసీ సెంటర్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • రాష్ట్రంలో యువత కోసం స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నామని వెల్లడి
  • ఖేడ్, జహీరాబాద్‌‌‌‌లో ఏటీసీల నిర్మాణాలకు శంకుస్థాపన

సంగారెడ్డి/నారాయణ్ ఖేడ్/జహీరాబాద్, వెలుగు: నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్, ఎడ్యుకేషన్ హబ్‌‌‌‌గా మారుస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి, నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల్లో పర్యటించారు. సంగారెడ్డిలో ఈఎస్ఐ హాస్పిటల్ ప్రారంభించిన ఆయన.. నారాయణఖేడ్, జహీరాబాద్‌‌‌‌లలో ఏటీసీల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో మంత్రి మాట్లాడారు. 

దేశంలోనే మొట్ట మొదటిసారిగా తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నామని, టాటా టెక్నాలజీస్ కంపెనీ భాగస్వామ్యంతో ప్రస్తుతానికి 64 నియోజకవర్గాల్లో అడ్వాన్స్‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టామ్‌‌‌‌కామ్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి దేశవ్యాప్తంగా ఉన్నత ఉద్యోగాలను సృష్టించబోతున్నామని చెప్పారు. మందమర్రిలో శిక్షణ తీసుకున్న 50 మంది కాండిడేట్లను ఉన్నత ఉద్యోగుల కోసం జర్మనీకి పంపించబోతున్నట్టు తెలిపారు. ఏఐ, రోబోటిక్స్, కంప్యూటర్, లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా మంచి ఉద్యోగాలు వస్తాయన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే లక్ష ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిందని, త్వరలో మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ కాంతి వాస్లే, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, సబ్ కలెక్టర్ ఉమాహారతి, ఎస్పీ పారితోష్ పంకజ్, కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్, జూకల్ సర్పంచ్ రజిత వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి నారాయణఖేడ్‌‌‌‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ రావి ఆకుపై చిత్రీకరించిన చిత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శివకుమార్ ప్రతిభను మంత్రి వివేక్ మెచ్చుకున్నారు. 

సంగారెడ్డిలో ఈఎస్ఐ హాస్పిటల్ ప్రారంభం.. 

రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ఈఎస్ఐ డిస్పెన్సరీని హెల్త్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేశ్‌‌‌‌ షెట్కార్‌‌‌‌‌‌‌‌తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ ఈఎస్ఐ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు వివేక్‌‌‌‌ తెలిపారు. 

సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసే కార్మికులకు స్థానికంగానే అన్ని వైద్య సేవలు అందించేందుకు ఇక్కడ ఈఎస్ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 80 లక్షల కుటుంబాలకు ఈఎస్ఐ వైద్య సేవలు అందుతున్నాయన్నారు. సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నందున కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. 

రూ.200 కోట్లతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని, జహీరాబాద్, నారాయణఖేడ్, సదాశివపేట, ఆందోల్, జోగిపేటల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల దృష్ట్యా 104 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.గౌతమ్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌లు వనితా సంతోష్, అంజమ్మ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తదితరులు పాల్గొన్నారు.