హైదరాబాద్ సీఎంసీలో వాక్ ఫ్రీ డ్రైవ్ ..ఫుట్ పాత్ లపై 488 ఆక్రమణల తొలగింపు

హైదరాబాద్ సీఎంసీలో వాక్ ఫ్రీ  డ్రైవ్ ..ఫుట్ పాత్ లపై 488 ఆక్రమణల తొలగింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు:   సీఎంసీలోని మూడు జోన్లలో వాక్ ఫ్రీ డ్రైవ్ పేరుతో ఫుట్‌‌పాత్ ఆక్రమణల తొలగిస్తున్నారు. శుక్రవారం టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ టీమ్స్​కలిసి 15 రోడ్లపై 22.28 కిలోమీటర్ల మేర ఫుట్‌‌పాత్‌‌లపై 488 ఆక్రమణలను తొలగించారు. ఫుట్‌‌పాత్‌‌లపై  ఆక్రమణలను సహించేది లేదని కమిషనర్ సృజన హెచ్చరించారు. ఇలాంటి డ్రైవ్‌‌లు నిరంతరం కొనసాగుతాయన్నారు.