I Hate Marriage Teaser: పెళ్లి, కెరీర్ మధ్య Gen Z ఊగిసలాట.. యూత్‌ పల్స్ పట్టుకునేలా కొత్త మూవీ టీజర్

I Hate Marriage Teaser: పెళ్లి, కెరీర్ మధ్య Gen Z ఊగిసలాట.. యూత్‌ పల్స్ పట్టుకునేలా కొత్త మూవీ టీజర్

సుగి విజయ్‌‌‌‌‌‌‌‌, జుప్సీ భద్ర, హారిక రాజేందర్‌‌‌‌‌‌‌‌ హీరో హీరోయిన్లుగా పరమేష్‌‌‌‌‌‌‌‌ రేణుకుంట్ల దర్శకత్వంలో దయానంద్‌‌‌‌‌‌‌‌ మాదం, కార్తీక్‌‌‌‌‌‌‌‌ వెంపటి నిర్మిస్తున్న  చిత్రం ‘ఐ హేట్‌‌‌‌‌‌‌‌ మ్యారేజ్‌‌‌‌‌‌‌‌’.

ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇటీవల ‘అప్పుడే పెళ్లా’  అనే లిరికల్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయగా, శనివారం టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  ప్రేమ, పెళ్లి, కెరీర్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌గా ఉండాలనుకునే  జెన్‌‌‌‌‌‌‌‌ జీ బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు కనెక్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యే సినిమా ఇదని దర్శకుడు చెప్పాడు.

పెళ్లి విషయంలో యువతకు ఉండే సందేహాలు, సంబంధాలపై వారి అభిప్రాయాలు, జీవితంలో తీసుకునే నిర్ణయాలు సినిమాలో కీలకంగా ఉండనున్నాయని ఈ టీజర్ తెలియజేస్తోంది. బాయ్ ఫ్రెండ్ తో ఎంత పచ్చిగా తిరిగిన పర్లేదు.. మ్యారేజ్ మాత్రం మా పేరెంట్స్ చూసిన అబ్బాయితోనే జరగాలి.. అనే డైలాగ్ వైరల్ గా మారింది. 

యూత్‌‌‌‌‌‌‌‌ అంతా రిలేట్ చేసుసుకునేలా సినిమా ఉంటుందని నటీనటులు అన్నారు. త్వరలోనే  ఈ సినిమా రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ను ప్రకటిస్తామని నిర్మాతలు తెలియజేశారు.