సాయి దుర్గ తేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా బిహైండ్ ద సీన్స్‌తో ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్.
160 రోజులకు పైగా, 10కి పైగా భారీ షెడ్యూల్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిపారని, భారీ సెట్స్, యాక్షన్ సన్నివేశాలతో పాటు మూవీ టీమ్ మధ్య బాండింగ్‌ను ఈ వీడియోలో చూపించారు. సాయి దుర్గ తేజ్ తన టీమ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సెట్స్‌లో సందడి వాతావరణం నెలకొంది. టీమ్ సభ్యులంతా కేరింతలు కొడుతూ, ఒకరినొకరు హాగ్ చేసుకుంటూ, సరదాగా నీళ్లు, ఫేక్ బ్లడ్ చల్లుకుంటూ షూటింగ్ పూర్తయిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
160+ days of shooting, 10+ massive schedules, and a journey that will always be special to me. Can’t wait for you all to experience this world. https://t.co/7NYc662gIq
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 18, 2026
ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నటుడితో పాటు కన్నడ నటుడు ధనంజయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ కాగా, జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రటించారు. భారీ స్థాయిలో డిఫరెంట్ లొకేషన్స్‌లో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని మూవీ టీమ్ చెప్పింది.
