Don't Sleep Teaser: మిస్టరీ, థ్రిల్‌తో ‘డోంట్ స్లీప్’ టీజర్.. కమల్ హాసన్ చేతుల మీదుగా రిలీజ్

Don't Sleep Teaser: మిస్టరీ, థ్రిల్‌తో ‘డోంట్ స్లీప్’ టీజర్.. కమల్ హాసన్ చేతుల మీదుగా రిలీజ్

‘చౌర్య పాఠం’తో  ఆకట్టుకున్న ఇంద్ర రామ్ హీరోగా నటిస్తున్న  కొత్త చిత్రం  ‘డోంట్ స్లీప్’. సినిమాటోగ్రాఫర్ షామ్‌‌దత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వి డ్రీమ్స్ ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌పై  వి చూడామణి నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ టీజర్‌‌‌‌ను కమల్ హాసన్ రిలీజ్ చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ అందించారు.  సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌గా రాబోతున్న ఈ  మూవీ టీజర్  ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

రవీంద్ర విజయ్, తబా రీమా, జోయీతా బెనర్జీ, వెన్నెల కిశోర్  కీలక పాత్రలు పోషిస్తున్నారు.  గోకుల్ హర్షన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.