హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫిర్యాదులు పరిష్కరించకుండానే రిజాల్వ్చేసినట్టు చూపిన11 మంది మేనేజర్లకు వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి శుక్రవారం చార్జ్ మెమోలు ఇష్యూ చేశారు. సమస్య పరిష్కారమైన తర్వాతే రిజాల్వ్అని చూపాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని, జనాల్లో బోర్డు విశ్వసనీయత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
