- ‘ఫీజు బకాయి- బీజేపీ లడాయి’ వర్క్ షాపులో నేతల హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడు దల చేసే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని బీజేపీ నేతలు హెచ్చరించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ‘ఫీజు బకాయి- బీజేపీ లడాయి’ పేరుతో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 4 లక్షల మంది విద్యా ర్థుల భవిష్యత్ ఇబ్బందు ల్లో పడిందని ఆరోపించారు. ప్రస్తుతం 10 వేల కోట్ల నుంచి 12 వేల కోట్ల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, చదువులు పూర్తయినా సర్టిఫికెట్లు రాక విద్యార్థులు నష్టపోతున్నారని వారు అన్నారు. గతంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో బస్సు యాత్ర చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చామని, అదే విధంగా ఫీజు బకాయిలపై కూడా పోరా టం చేస్తామని వారు హెచ్చరించారు.
