ఆర్టీసీలో డీజిల్ బస్సులనే నడపండి..మేనేజమెంట్కు జేఏసీ నేతల విజ్ఞప్తి

ఆర్టీసీలో డీజిల్ బస్సులనే నడపండి..మేనేజమెంట్కు జేఏసీ నేతల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు తరుచూ ప్రమాదానికి గురవుతుండడం, ప్రయాణీకులు భయందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో డీజిల్ బస్సులనే నడపాలని జేఏసీ నేతలు యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ జేఏసీ నేతలు ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి, యాదయ్య, యాదగిరి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

డీజిల్ బస్సులే ప్రయాణీకులకు అత్యంత సురక్షితమని, ఎలక్ట్రిక్ బస్సులు రిపేర్ల కోసం ఆయా కంపెనీలకు వెళ్లడంతో  కండక్టర్లకు కూడా డ్యూటీలు ఉండడం లేదని వారు యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కండక్టర్లకు లీవ్ లు వేయడం, లేదంటే ఇతర డిపోలక బదిలీ చేస్తున్నారని, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని డీజిల్ బస్సులనే కొనసాగించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.