తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుల మార్పు లేదు.. అందరూ కలిసి పని చేయాలి..

తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుల మార్పు లేదు.. అందరూ కలిసి పని చేయాలి..

తుంగతుర్తి, వెలుగు : తుంగతుర్తి నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల పార్టీ అధ్యక్షుల్లో ఎలాంటి మార్పు లేదని ఎమ్మెల్యే మందుల సామేల్ స్పష్టం చేశారు. బుధవారం స్థానికంగా మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు అధ్యక్షులంతా యథావిధిగా కొనసాగుతారని చెప్పారు. 

కొత్త, పాత అనే తేడా లేకుండా అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ ఆదేశాలను శిరసావహిస్తానని చెప్పారు. తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతోందని, సుమారు రూ. 200 కోట్లతో నియోజకవర్గ రూపురేఖలు మారుస్తున్నామన్నారు. ఎన్ఆర్ఐ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి దానం చేసిన ఏడు ఎకరాల స్థలంలో త్వరలోనే మినీ స్టేడియం నిర్మిస్తామన్నారు. సర్ పై అలర్ట్ గా ఉండాలని సూచించారు.