గంగపుత్రులను ఉద్యమకారులుగా గుర్తించాలి.. రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని గంగపుత్ర సంఘం డిమాండ్

గంగపుత్రులను ఉద్యమకారులుగా గుర్తించాలి.. రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని గంగపుత్ర సంఘం డిమాండ్

పద్మారావునగర్, వెలుగు: తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న గంగపుత్రులను ఉద్యమకారులుగా గుర్తించి, వారికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని, ప్రభుత్వ పథకాల్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ గంగపుత్ర సంఘం(టీజీఎస్) రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేశ్​ఖన్నా కోరారు. బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్​చార్జి డాక్టర్ జె.చిన్నారెడ్డికి వినతి పత్రం అందజేశారు. గంగపుత్రుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఆయన.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.