ఇబ్రహీంపట్నం, వెలుగు: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్షల విలువైన 1.400 లీటర్ల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లి చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. తుర్కయంజాల్ ఏవీ నగర్‌కు చెందిన కోట ఆనంద్ కుమార్, చంపాపేట్‌కు చెందిన ఠాగూర్ కమల్ కుమార్ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. 1.400 లీటర్ల హాష్ ఆయిల్ లభ్యమైంది. దీంతో ఆ ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
