బాలాపూర్, వెలుగు: బాలాపూర్, పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వందల సంఖ్యలో హిందూ యువతుల మిస్సింగ్స్, అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో సీపీ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఎస్‌ఐఆర్ నిర్వహణలో భాగంగా డ్యూటీలు చేస్తున్న బీఎల్ వోలు, బీఎల్‌ఏలకు సమస్యాత్మక పోలింగ్‌బూత్‌లలో భద్రత కల్పించాలన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాల స్థావరాలపై తనిఖీలు నిర్వహించాలన్నారు.
నియోజకవర్గంలో వందలాది మంది హిందూ యువతులు అదృశ్యమవుతున్నారని, వివిధ పోలీస్ స్టేషన్లలో అనేక మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. వాటిపై దర్యాప్తు చేపట్టి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని విన్నవించారు. రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
