రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో అటెండెన్స్ ‘మీ ప్రమాణం’ యాప్ లో

రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో అటెండెన్స్ ‘మీ ప్రమాణం’ యాప్ లో

హైదరాబాద్, వెలుగు:   రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు, నర్సింగ్ కాలేజీలు, నర్సింగ్ స్కూళ్లలో ఇకపై ‘మీ ప్రమాణం’ మొబైల్ యాప్ ద్వారానే హాజరు నమోదు చేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ నరేంద్ర కుమార్ ఆదేశించారు.  

విద్యార్థులతోపాటు,   రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌‌సోర్సింగ్ సిబ్బంది అందరూ ప్రతిరోజూ యాప్‌‌లోనే హాజరు నమోదు చేయాలని సూచించారు. అమలును పర్యవేక్షించేందుకు మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లను జిల్లా నోడల్ అధికారులుగా నియమించారు. వారు సంబంధిత సంస్థలకు ప్రత్యేక లాగిన్ ఐడీలు రూపొందించనున్నారు.