జకర్తా: ఇండియా బాక్సర్ విశ్వనాథ్.. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరగిన మెన్స్ 50 కేజీల క్వార్టర్‌ఫైనల్లో విశ్వనాథ్ 5–0తో ఇబ్రహీం అల్జోహానీ (సౌదీ అరేబియా)పై గెలిచాడు. 55 కేజీల్లో గంగ 5–0తో క్వాంగ్ లాక్ ట్రాన్ (వియత్నాం)ను ఓడించాడు.
65 కేజీల్లో వంశజ్ 4–1తో అసిల్‌ఖాన్ కోషెర్‌బాయ్ (కజకిస్తాన్)పై, 70 కేజీల్లో హితేష్ ఆర్‌ఎస్‌సీ ద్వారా రాడియాన్షా (ఇండోనేసియా)పై గెలిచారు. 80 కేజీల్లో ఆర్యన్ మాలిక్, 85 కేజీల్లో రాకీ చౌదరి, 90 కేజీల్లో హేమంత్ సాంగ్వాన్ ఓటమిపాలయ్యారు. ఓవరాల్‌గా ఇండియాకు ఆరు పతకాలు ఖాయమయ్యాయి.
