హైదరాబాద్, వెలుగు: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న హైదరాబాద్ ఈ చాంపియన్స్.. టీజీ 20 లీగ్‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. చేజింగ్‌లో అభిరథ్ రెడ్డి (82), వికాస్ రెడ్డి (45) రాణించడంతో.. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్స్–2లో ఈ చాంపియన్స్ 8 వికెట్ల తేడాతో కరీంనగర్ డైమండ్స్‌పై గెలిచింది.
ముందుగా కరీంనగర్ 20 ఓవర్లలో 157/7 స్కోరు చేసింది. సింహా (38), శుభమ్ శర్మ (31 నాటౌట్), సాత్విక్ రెడ్డి (28), రాహుల్ రాధేశ్ (28) మెరుగ్గా ఆడారు. అజయ్ దేవ్ గౌడ్, అశ్విన్, ప్రణవ్ వర్మ తలా రెండు వికెట్లు తీశారు.
తర్వాత హైదరాబాద్ 15.3 ఓవర్లలో 160/2 స్కోరు చేసింది. వైష్ణవ్ రెడ్డి (25) ఫర్వాలేదనిపించాడు. అఖిల్ సంకోజు, శుభమ్ చెరో వికెట్ తీశారు. అభిరథ్ రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
