క్లీన్ స్వీప్ తప్పేనా? ఇవాళ (జులై 11) ఇంగ్లండ్తో ఇండియా ఐదో టీ20.. శాంసన్కు చోటు దక్కేనా?

క్లీన్ స్వీప్ తప్పేనా? ఇవాళ (జులై 11) ఇంగ్లండ్తో ఇండియా ఐదో టీ20.. శాంసన్కు చోటు దక్కేనా?
  • రా. 7 నుంచి సోనీ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌

సౌతాంప్టన్‌‌‌‌‌‌‌‌:  కొత్త కెప్టెన్‌‌‌‌‌‌‌‌.. పాత జట్టుతో బరిలోకి దిగిన ఇండియా.. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ గడ్డపై తీవ్రంగా నిరాశపర్చింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో శనివారం జరిగే ఆఖరిదైన ఐదో టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యింది. కనీసం ఇందులోనైనా గెలిచి క్లీన్‌‌‌‌‌‌‌‌ స్వీప్‌‌‌‌‌‌‌‌ కాకుండా గౌరవాన్ని కాపాడుకోవాలని టీమిండియా భావిస్తోంది. 

ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఒకటి వర్షం వల్ల రద్దు కాగా, మిగిలిన మూడింటిలో ఇండియా ఓటమిపాలైంది. కొత్తగా టీ20 కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌కు ఒక్క విజయం కూడా దక్కలేదు. 2006లో టీమిండియా టీ20లు ఆడటం మొదలైనప్పట్నించి సుదీర్ఘకాలంగా విజయం సాధించకపోవడం ఇదే తొలిసారి.

 రెండో టీ20లో మినహా మిగిలిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో అయ్యర్‌‌‌‌‌‌‌‌సేన ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ జోఫ్రా ఆర్చర్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కోవడంలో ఇండియా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ సీమర్‌‌‌‌‌‌‌‌ సామ్‌‌‌‌‌‌‌‌ కరన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ వైవిధ్యాన్ని కూడా అంచనా వేయలేకపోతున్నారు.

 గాయాల కారణంగా వరుణ్‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి, హర్షిత్‌‌‌‌‌‌‌‌ రాణా దూరం కావడం, స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌ కోల్పోవడం ఇండియా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ విభాగాన్ని మరింత బలహీనం చేసింది. అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో జట్టు ఎంపికపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

తుది జట్టులో సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌కు చోటు కల్పించకపోవడంపై తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌‌‌‌‌‌‌‌లో లేని తెలుగు బ్యాటర్‌‌‌‌‌‌‌‌ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో శాంసన్‌‌‌‌‌‌‌‌ను తీసుకోవాలని యోచిస్తున్నారు. అలా చేస్తే బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ దెబ్బతింటుందని హెడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ గంభీర్‌‌‌‌‌‌‌‌ భావిస్తున్నాడు. ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌ మూడో స్థానం కంటే కింద బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తే జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

వండర్‌‌‌‌‌‌‌‌ కిడ్‌‌‌‌‌‌‌‌ వైభవ్ సూర్యవంశీ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని యాజమాన్యం భావిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. విల్ జాక్స్, ఆదిల్ రషీద్, లియామ్ డాసన్ వంటి స్పిన్నర్లు పిచ్‌‌‌‌‌‌‌‌ను చక్కగా ఉపయోగించుకుంటూ రన్స్‌‌‌‌‌‌‌‌ను నియంత్రిస్తున్నారు. 

బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్, యువ ఆటగాడు జాకబ్ బెథెల్ స్వదేశీ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ ఇండియా బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా కెప్టెన్ అయ్యర్ తన పేరిట ఉన్న పరాజయాల పరంపరకు అడ్డుకట్ట వేసి, ఈ ఆఖరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనైనా జట్టును గెలిపించి పరువు నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.

తుది జట్లు (అంచనా)

ఇండియా: శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), అభిషేక్ శర్మ,  వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే / సూర్యాంష్ షెడ్జ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్ , ప్రిన్స్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ కృష్ణ. 

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌: హ్యారీ బ్రూక్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), ఫిల్‌‌‌‌‌‌‌‌ సాల్ట్‌‌‌‌‌‌‌‌, జోస్ బట్లర్‌‌‌‌‌‌‌‌, జాకబ్‌‌‌‌‌‌‌‌ బెథెల్‌‌‌‌‌‌‌‌, టామ్‌‌‌‌‌‌‌‌ బాంటన్‌‌‌‌‌‌‌‌, సామ్‌‌‌‌‌‌‌‌ కరన్‌‌‌‌‌‌‌‌, విల్‌‌‌‌‌‌‌‌ జాక్స్‌‌‌‌‌‌‌‌, రెహాన్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌, ఆదిల్‌‌‌‌‌‌‌‌ రషీద్‌‌‌‌‌‌‌‌, జోఫ్రా ఆర్చర్‌‌‌‌‌‌‌‌, జోష్‌‌‌‌‌‌‌‌ టంగ్‌‌‌‌‌‌‌‌. 

పిచ్‌‌‌‌‌‌‌‌, వాతావరణం

బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు అనుకూలం. భారీ స్కోర్లు నమోదయ్యే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. టాస్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ ఎంచుకోవచ్చు. వర్షం ముప్పు లేదు. నాలుగేళ్ల కిందట ఆడిన ఏకైక టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఈజీగా గెలిచింది.