లార్డ్స్ టెస్టు: ఇండియా 285 ఆలౌట్‌‌‌‌

లార్డ్స్ టెస్టు: ఇండియా 285 ఆలౌట్‌‌‌‌

లండన్‌‌‌‌: ఇంగ్లండ్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌‌‌‌లో ఇండియా మెరుగ్గా ఆడింది. స్మృతి మంధాన (83), కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ (58), దీప్తి శర్మ (57) రాణించడంతో.. టాస్‌‌‌‌ ఓడిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 74.5 ఓవర్లలో 285 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. 

ఏడు ఓవర్లు ముగిసేరికి షెఫాలీ వర్మ (0), యాస్తిక భాటియా (12) వెనుదిరగడంతో.. ఇండియా 37/2 స్కోరుతో నిలిచింది. ఓపెనర్‌‌‌‌ స్మృతి.. జెమీమా రొడ్రిగ్స్‌‌‌‌ (35)తో కలిసి మూడో వికెట్‌‌‌‌కు 64, హర్మన్‌‌‌‌తో కలిసి నాలుగో వికెట్‌‌‌‌కు 89 రన్స్‌‌‌‌ జోడించింది. 

మిడిలార్డర్‌‌‌‌లో దీప్తి శర్మ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. రిచా ఘోష్‌‌‌‌ (13), స్నేహ్‌‌‌‌ రాణా (13), సయాలీ (1), క్రాంతి గౌడ్‌‌‌‌ (1) నిరాశపర్చారు. ఎకిల్‌‌‌‌స్టోన్‌‌‌‌ 3, లారెన్‌‌‌‌ ఫిలర్‌‌‌‌, ఇసీ వాంగ్‌‌‌‌, మ్యాడీ విలియర్స్‌‌‌‌ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌‌‌ 11 ఓవర్లలో 21/1 స్కోరు చేసింది. 

మియా బౌచిర్‌‌‌‌ (17 బ్యాటింగ్‌‌‌‌), హీథర్‌‌‌‌ నైట్‌‌‌‌ (1 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌‌‌‌లో ఇండియా బ్యాటర్‌‌‌‌ స్మృతి అరుదైన రికార్డులను నెలకొల్పింది. ఇండియా తరఫున అతి పిన్న వయసులో 300 మ్యాచ్‌‌‌‌లు ఆడిన తొలి ప్లేయర్‌‌‌‌గా రికార్డులకెక్కింది. ఇక లార్డ్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ చేసిన తొలి విమెన్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌గా నిలిచింది.