ఆర్చరీ వరల్డ్ కప్‌: కీర్తి శర్మ, ప్రితిక ముందంజ

ఆర్చరీ వరల్డ్ కప్‌: కీర్తి శర్మ, ప్రితిక ముందంజ

మాడ్రిడ్‌‌‌‌‌‌‌‌: ఆర్చరీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌–4లో ఇండియా ఆర్చర్లు కీర్తి శర్మ, ప్రితిక ప్రదీప్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టారు. శుక్రవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ రికర్వ్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో కీర్తి 6–2తో ఎలియా కెనాల్స్‌‌‌‌‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌‌‌‌‌)పై గెలిచింది.

 కాంపౌండ్‌‌‌‌‌‌‌‌ కేటగిరీ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో  ప్రితిక 140–135తో ఆండ్రియా మునోజ్‌‌‌‌‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌‌‌‌‌)పై, ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో 147–146తో లికో అర్రియోలా (అమెరికా)పై, తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో145-–144తో పార్క్‌‌‌‌‌‌‌‌ జుంగ్యూన్‌‌‌‌‌‌‌‌ (సౌత్‌‌‌‌‌‌‌‌ కొరియా)పై గెలిచింది.

 రౌండ్‌‌‌‌‌‌‌‌–32లో జ్యోతి సురేఖ 148–146తో వేయ్‌‌‌‌‌‌‌‌ ఫాంగ్యావో (చైనా)పై గెలిచినా.. క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో 146–147తో హజల్‌‌‌‌‌‌‌‌ బురున్‌‌‌‌‌‌‌‌ (టర్కీ) చేతిలో ఓడింది. మెన్స్‌‌‌‌‌‌‌‌ రికర్వ్‌‌‌‌‌‌‌‌లో ధీరజ్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోనే ఇంటిముఖం పట్టాడు.