కోల్‌బెల్ట్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చూపిన చొరవతోనే సింగరేణి సంస్థకు తాడిచర్ల-2 కోల్బ్లాక్దక్కిందని కాంగ్రెస్లీడర్లు కొనియాడారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని సింగరేణి సీహెచ్‌పీ కార్మికులు, కాంగ్రెస్ లీడర్లు సీఎం, మంత్రి వివేక్, ఎంపీ వంశీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు.
తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలని ఎంపీ పార్లమెంటులో నిరంతరం మాట్లాడారని పేర్కొన్నారు. కొత్త బొగ్గు బ్లాక్కేటాయింపు వల్ల సింగరేణి సంస్థ పరిరక్షణ, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్ అజీజ్, సీనియర్ నేత గాండ్ల సమ్మయ్య, జిల్లా సెక్రటరీలు మహంకాళి శ్రీనివాస్, గోపతి బానేశ్, టౌన్జనరల్ సెక్రటరీ బి.వేణు తదితరులు పాల్గొన్నారు.
