కేటీఆర్ పగటి కలలు కంటున్నారు : కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

కేటీఆర్ పగటి  కలలు కంటున్నారు :  కాంగ్రెస్ ఎంపీ చామల  కిరణ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  ఇప్పుడే ఎన్నికలు వచ్చినట్లు, గెలిచినట్లు కేటీఆర్ పగటి కలలు కంటున్నాడని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సర్వేల పేరుతో ఊహల్లో విహరిస్తుండని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో గెలుస్తున్నామని, లోక్ సభ ఎన్నికల్లో గెలుపు మాదేనని గొప్పలకు పోయి గుండు సున్నా తెచ్చుకుండని అన్నారు. 

మళ్లీ ఇప్పుడు సర్వేల పాట పాడుతుండని, ఇప్పుడు తమకే అనుకూలం ఉందని ప్రజలను సర్వేల పేరుతో తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తుండని ధ్వజమెత్తారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తో తనకు ఎలాంటి విబేధాలు లేవని, మండల అధ్యక్షుల ఎంపిక విషయంలో అందరి అభిప్రాయాలు తెలుసుకొని నియమించాలని కోరానని, అంతకు మించి తాను పార్టీ కమిటీల నియామకంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు.