పాల్వంచ, వెలుగు: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 35 విద్యాసంస్థలను స్థాపించడంతో పాటు అనేక మంది గిరిజన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యనందించిన డాక్టర్ కాటిరెడ్డి లక్ష్మారెడ్డి సేవలు చిరస్మరణీయమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం పాల్వంచ కె.ఎల్.ఆర్ ఘాట్ లో లక్ష్మా రెడ్డి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వ్యతిరేక ర్యాలీని కేఎల్ఆర్ ఫార్మసీ విద్యార్థులు నిర్వ హించగా డీఎస్పీ సతీశ్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాష, విద్యాసంస్థల డైరెక్టర్ సిద్ధార్థ రెడ్డి, సెక్రటరీ సింధు, కోశాధికారి స్నేహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. .
