మెడికల్ కాలేజీల అప్పీళ్లు.. ఇక ఆన్‌‌ లైన్ లోనే...ఒక్కో అప్పీల్‌‌కు జీఎస్టీతో కలిపి రూ. 59 వేల ఫీజు..

మెడికల్ కాలేజీల అప్పీళ్లు.. ఇక ఆన్‌‌ లైన్ లోనే...ఒక్కో అప్పీల్‌‌కు  జీఎస్టీతో కలిపి రూ. 59 వేల ఫీజు..

హైదరాబాద్, వెలుగు: నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) వివిధ బోర్డుల నిర్ణయాలపై కాలేజీలు చేసుకునే అప్పీళ్లకు ఆన్‌‌లైన్ అప్పీల్ పోర్టల్‌‌ ను ప్రారంభించింది.  ఈ-మెయిల్ ,  ఇతర మార్గాల్లో   అప్పీళ్లకు చాన్స్​లేదు.   కేవలం application.nmc.org.in/login వెబ్‌‌ సైట్ ద్వారానే అభ్యంతరాలు దాఖలు చేయాలని ఎన్ఎంసీ సెక్రటరీ డాక్టర్ రాఘవ్ లంగర్ స్పష్టం చేశారు. 

ముఖ్యంగా 2026-–27 అకాడమిక్ ఇయర్ కు  దరఖాస్తు చేసుకున్న సంస్థలు, పాత లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారానే ఈ పోర్టల్‌‌ లో లాగిన్​ కావొచ్చని,  ప్రతి అప్పీల్‌‌ కు మొత్తం జీఎస్టీతో కలిపి రూ. 59,000 ఫీజు ఆన్‌‌ లైన్‌‌ లో లేదా ఎన్ఈఎఫ్టీ/ఆర్టీజీఎస్ ద్వారా  చెల్లించాలని చెప్పారు. షోకాజ్ నోటీసులు, ఇన్స్‌‌పెక్షన్ రిపోర్టులను అటాచ్​ చేయాలని,   అసంపూర్తిగా లేదా తప్పుగా పంపే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని కమిషన్ హెచ్చరించింది.