హైదరాబాద్, వెలుగు: డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎం రోజువారీ యూపీఐ లావాదేవీల భద్రతను పెంచేందుకు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సహాయంతో వినియోగదారులు తమ ఫేస్ ఐడీ లేదా ఫింగర్ ప్రింట్ ద్వారా యూపీఐ చెల్లింపులు, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు.
రూ.ఐదు వేలలోపు లావాదేవీలకు ఈ రెండు ఫీచర్లను వాడుకోవచ్చు. అంతకంటే ఎక్కువ మొత్తాలకు మాత్రం యూపీఐ పిన్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి. ఈ విధానంలో బయోమెట్రిక్ సమాచారాన్ని బ్యాంక్ లేదా కంపెనీ నిల్వ చేయదు.
దీంతో గోప్యత మరింత పెరుగుతుంది. డెబిట్ కార్డు అవసరం లేకుండా ఏటీఎం స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకునే కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ సదుపాయాన్ని కూడా పేటీఎం తెచ్చింది. ఒక్కో లావాదేవీకి రూ.10 వేల వరకు నగదు తీసుకోవచ్చు.
స్క్రీన్ రికార్డింగ్‌ను అడ్డుకోవడం, ఫోన్ కాల్‌లో ఉన్నప్పుడు హెచ్చరికలు పంపడం లాంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయని పేటీఎం తెలిపింది.
