న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాలు, గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థలు 1600 సిరీస్ నంబర్లతో ప్రజలకు చేసే ఫోన్ కాల్స్ బ్లాక్ చేయకూడదని టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) శుక్రవారం స్పష్టం చేసింది. కస్టమర్లకు సేవలు అందించేందుకు ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏ లాంటి సంస్థల పరిధిలోని బ్యాంకులు, బీమా సంస్థలకు ఈ సిరీస్ నంబర్లను కేటాయించినట్లు వెల్లడించింది.
ప్రమోషనల్ కాల్స్ కోసం కేటాయించిన 140 సిరీస్ నంబర్లను కేవలం డు నాట్డిస్టర్బ్(డీఎండీ) రిజిస్ట్రీ ద్వారా మాత్రమే బ్లాక్చేయవచ్చని స్పష్టం చేసింది. సాధారణ యాప్‌లు వీటిని స్పామ్‌గా వర్గీకరించడం, కస్టమర్లను తప్పుదోవ పట్టించడమే అవుతుందని తెలిపింది.
ట్రూకాలర్ వంటి యాప్స్ 140, 1600 సిరీస్ నంబర్లను బ్లాక్ చేస్తున్న నేపథ్యంలో ట్రాయ్ ఈ ప్రకటన చేసింది.
