M.R.P Trailer: శవాన్ని కిడ్నాప్ చేసి కోట్ల ప్లాన్.. ‘MRP: నీకెంత.. నాకెంత’ ట్రైలర్ అదిరింది!

M.R.P Trailer: శవాన్ని కిడ్నాప్ చేసి కోట్ల ప్లాన్.. ‘MRP: నీకెంత.. నాకెంత’ ట్రైలర్ అదిరింది!

టాలీవుడ్ టాలెంటెడ్ యాకర్ట్ నరేశ్ అగస్త్య, కామెడీ కింగ్ వెన్నెల కిశోర్, ఫన్ బాంబ్ సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎంఆర్‌పీ’ (MRP). ‘నీకెంత.. నాకెంత’ అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్తో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. లేటెస్ట్గా రిలీజ్ చేసిన ట్రైలర్ భారీ అంచనాలను పెంచేస్తోంది.

మార్చురీలో పనిచేసే నలుగురు యువకులు గుర్తుతెలియని శవాన్ని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించాలని వేసిన ప్లాన్ చుట్టూ కథ సాగుతుంది. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ట్రైలర్, నేటి యువత ఆలోచనలను ప్రతిబింబిస్తోంది. మధ్యతరగతి యువత తమ కలలను నిజం చేసుకునే క్రమంలో ఎదుర్కొనే సవాళ్లు, ఆర్థిక లావాదేవీల చుట్టూ సాగే విభిన్నమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

శ్రవణ్ జేస్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డోనల్ బిష్ట్ హీరోయిన్‌గా నటించగా, అజయ్ అరసాడ సంగీతం అందించారు. జూలై 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తంగా,  ‘MRP’ ట్రైలర్ కొత్త కాన్సెప్ట్, డార్క్ హ్యూమర్, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో ఆసక్తిని పెంచింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఏదైనా చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఎంటర్‌టైనర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మాస్ అండ్ క్లాస్ టచ్లో..

గతంలో 'మత్తు వదలరా', 'సేనాపతి' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నరేశ్‌ అగస్త్య, ఈసారి ఒక మాస్ అండ్ క్లాస్ టచ్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు. ఇక వెన్నెల కిశోర్ తనదైన టైమింగ్‌తో నవ్వులు పూయించడానికి సిద్ధమయ్యారు. ఎం.ఎస్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రం, అటు యాక్షన్ ఇటు కామెడీ ఎలిమెంట్స్‌తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రైలర్, సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. మరి 'ఎంఆర్‌పీ'తో ఈ టీమ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.IN