తమిళ స్టార్ హీరో, సీఎం విజయ్ నటించిన ‘జన నాయగన్’ (Jana Nayagan) చిత్రానికి ఎట్టకేలకు సెన్సార్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'A' (Adults Only) సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్ హౌస్ అధికారిక పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రకటించింది. ఈ సందర్భంగా "నేను వస్తున్నా.. త్వరలోనే థియేటర్లలో కలుద్దాం నన్బా, నన్బీస్! అని విజయ్ సైతం పోస్ట్ పెట్టాడు. ముఖ్యంగా పోస్టర్‌లో తమిళనాడు చీఫ్ మినిస్టర్ టైటిల్ కార్డును ఉపయోగించడం ఆసక్తిరేపుతోంది. జులై 24న మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.
See you soon in theatres nanba & nanbis ❤️#JanaNayaganCensoredA 💥
— KVN Productions (@KvnProductions) July 11, 2026
Hon'ble Chief Minister @actorvijay @KvnProductions #HVinoth @hegdepooja @anirudhofficial @thedeol @_mamithabaiju @Jagadishbliss @LohithNK01 @RamVJ2412 @TSeries@PharsFilm @PicturesPVR @kamalgianc… pic.twitter.com/Rcx4Iuw52P
24 ఏళ్ల తర్వాత విజయ్ సినిమాకు 'A' సర్టిఫికేట్..
అయితే,‘జన నాయగన్’ విజయ్ కెరీర్‌లో తొలి 'A' సర్టిఫికేట్ సినిమా అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సినీవర్గాలు వెల్లడించాయి. 2002లో విడుదలైన ‘భగవతి’ చిత్రానికే తొలిసారిగా 'A' సర్టిఫికేట్ లభించగా, దాదాపు 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘జన నాయగన్’ అదే సర్టిఫికేషన్‌ను పొందినట్లు తెలిపాయి.
'A 'సర్టిఫికేట్..
నందమూరి బాలకృష్ణ నటించిన తెలుగు సూపర్ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’కి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి ఒరిజినల్‌లో U/A సర్టిఫికేట్ వచ్చింది. కానీ హెచ్. వినోద్ డైరెక్షన్‌లో విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా పొలిటికల్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ‘జననాయగన్’ స్క్రిప్ట్‌లో భారీ మార్పులు చేయడంతో.. ఈ రీమేక్‌కు 'A'(Adults Only) సర్టిఫికేట్ జారీ అయింది. సినిమా రన్ టైమ్ కూడా ఏకంగా 3 గంటల 3 నిమిషాలు ఉండటం విశేషం.
ALSO READ : ఇష్టమొచ్చిన బోల్డ్ కంటెంట్‌కు ఇక బ్రేక్..
'A' సర్టిఫికేట్: ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాలను 18 సంవత్సరాలు పైబడిన పెద్దలు మాత్రమే చూడాలి. ఈ సినిమాల్లో ఎక్కువ హింసాత్మక దృశ్యాలు, పూర్తి నగ్నత్వం, దూషించే భాష అన్నీ ఉంటాయి.
రిలీజ్ ఎప్పుడంటే?
ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో జూలై 23 లేదా 24న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు జూలై 24 రిలీజ్ డేట్‌ను లాక్ చేసినట్లు పోస్ట్ కూడా చేశారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, నరేన్ కీలక పాత్రలు పోషించారు. పూర్తి స్థాయి రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన చివరి చిత్రం కావడంతో 'జన నాయకన్'పై ఇప్పుడు అంచనాలు మరింత పెరిగాయి. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ ఖాయం అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
🔥 Finally! Our Own Thalapathy Vijay is ready to set the big screen on fire with #JanaNayagan💥
— York Cinemas (@yorkcinemas) July 8, 2026
🇨🇦 Canada Release by York Cinemas
🎬 Igniting screens from July 24.
Get ready for the ultimate theatrical celebration.
Stay tuned for tickets 🎫#thalapathyvijay #yorkcinemas pic.twitter.com/CcyiZAZqUp
