Bhagyashri Borse: ‘లెనిన్’ హిట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న భాగ్యశ్రీ.. తెలుగు ఆడియన్స్కు ఎమోషనల్ థ్యాంక్స్

Bhagyashri Borse: ‘లెనిన్’ హిట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న భాగ్యశ్రీ.. తెలుగు ఆడియన్స్కు ఎమోషనల్ థ్యాంక్స్

‘లెనిన్’ సక్సెస్ మీట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొన్నేళ్లుగా అఖిల్, భాగశ్రీలకు సరైన హిట్ ఒక్కటిలేదు. ఈ క్రమంలోనే ‘లెనిన్’తో సక్సెస్ అవ్వాలని ఎంతో కసిగా పనిచేశారు. ఎట్టకేలకు వీరు కోరుకున్న హిట్ దక్కడంతో ఒక్కొక్కరుగా ఎమోషనల్ అవుతున్నారు. నిన్న (జులై 10న) అన్నపూర్ణ స్టూడియోలో జరిపిన సెలబ్రేషన్స్లో అఖిల్ ఫుల్ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. తండ్రి నాగార్జున పాదాలకు నమస్కరించి.. ఆయన్ను గట్టిగా కౌగిలించుకుని భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా (జులై 11న) భాగ్యశ్రీ కూడా భావోద్వేగానికి గురయ్యారు. తనపై అపారమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్న తెలుగు ప్రేక్షకులు, అభిమానులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా భాగ్యశ్రీ హైదరాబాద్‌ను తన ‘కర్మభూమి’గా అభివర్ణించింది. ‘‘తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. నా సినీ కెరీర్‌లో చివరి సినిమా కూడా తెలుగులోనే ఉండాలని కోరుకుంటున్నాను’’అంటూ భాగ్యశ్రీ ఎమోషన్గా మాట్లాడింది. దీంతో సక్సెస్ మీట్ ప్రాంగణం అంతా చప్పట్లతో మార్మోగగా, ‘థియేటర్లో ఆడియన్స్ని ఎమోషనల్ చేసి.. స్టేజీపై మీరు కన్నీళ్లు పెడుతున్నారా’ అంటూ ప్రశంసించారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన స్పీచెస్ అక్కేనేని ఫ్యాన్స్ను ఆకట్టుకుంటున్నాయి.  

ఇదే సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున కూడా అక్కినేని అభిమానులను ప్రశంసించారు.‘‘అక్కినేని ఫ్యాన్స్ దేవుళ్లు. అఖిల్‌కు బ్లాక్‌బస్టర్ రావాలని ఇంతకాలం ఎదురుచూశారు. చైతూకి 'తండేల్' కోసం ఎలా వెయిట్ చేశారో, అఖిల్‌కు 'లెనిన్' కోసం కూడా అలాగే నిలబడ్డారు. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాం’’ అంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్ అందుకుంది. తొలి రోజు జులై 10న ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సత్తా చాటింది. 'లెనిన్' చిత్రానికి అటు ప్రేక్షకుల నుంచే కాకుండా ఇండస్ట్రీ నుంచి కూడా గట్టి మద్దతు లభిస్తోంది. అఖిల్, భాగ్యశ్రీల నటనకు, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్లకు థియేటర్లలో ఈలలు, గోలలతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు