షాబాద్ ఘటనలో సంచలనం.. సీఐ, ఎస్ఐలు సస్పెండ్

షాబాద్  ఘటనలో సంచలనం.. సీఐ, ఎస్ఐలు సస్పెండ్

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ను వణికించిన ఆరుగురి హత్యల కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.  ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఇప్పటికే ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన సబ్ ఇన్‌స్పెక్టర్ (SI)ను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రకటించగా... తాజాగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) క్రాంతి రెడ్డిని సైతం సస్పెండ్ చేస్తూ సీపీ తరుణ్ జోషి సంచలన ఆదేశాలు జారీ చేశారు.

ఈ దారుణానికి ముందే ఒక మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు అయితే నమోదు చేశారు కానీ... పోక్సో (POCSO) చట్టం కింద కేసు ఉన్నప్పటికీ నిందితుడు రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేయకపోవడమే ఈ ఘోరానికి కారణమని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితుడు రాజ్‌కుమార్‌కు పోలీసులు లోపాయికారిగా సహకరించడం వల్లే ఇంతటి దారుణం జరిగిందని వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

నిందితుడి ఆచూకి చెబితే రెండు లక్షలు

మరోవైపు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఫ్యూచర్ సిటీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఆరు హత్యల కేసులో ప్రస్తుతం పరారీలో ఉన్న సైకో నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ తెలిపిన వారికి లేదా అతడి అరెస్టుకు సహకరించేలా సమాచారం అందించిన వారికి రూ. 2 లక్షల నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు.

ఆరుగురిని చంపి పరార్

మైనర్ పై అత్యాచార వేధింపుల ఆరోపణలతో.. పోక్సో కేసులో అరెస్టెన రాజ్ కుమార్ .. బెయిల్ పై బయటికొచ్చి ఆరుగురిని చంపేశాడు దుర్మార్గుడు. శుక్రవారం (జులై 10) అర్థరాత్రి  రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

కిరాతకకుడు.. మొదటగా ఇంటికి వెళ్లి తన భార్య, ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత పోక్సో కేసు పెట్టిన బాధిత బాలిక కుటుంబంలో మరో ముగ్గురిని హత్య చేశాడు. బాలికను వేధించినందుకు రాజ్ కుమార్ పై మే 16న పోక్సో కేసు నమోదైంది. మే 26న అరెస్ట్ అయి జైలుకెళ్లిన దుర్మార్గుడు.. శుక్రవారం (జులై 10) బెయిల్పై తిరిగి వచ్చి అత్యంత కిరాతకంగా దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి వెళ్లి తన భార్య, ఇద్దరు పిల్లల హత్య చేశాడు. ఆ తర్వాత బాధిత బాలిక, బాలిక తల్లి, నాయనమ్మలను హత్య చేశాడు. బాలికను ఊరి శివారల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.