అయ్యయ్యో.. 3 మ్యాచ్‌లు ఫెయిల్.. అయినా వైభవ్‌ను వదలొద్దంటున్న మాజీ కోచ్!

అయ్యయ్యో.. 3 మ్యాచ్‌లు ఫెయిల్.. అయినా వైభవ్‌ను వదలొద్దంటున్న మాజీ కోచ్!

IND vs ENG 5th T20I: భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో వచ్చి అవకాశాలని అందుకోవడంతో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ వైఫల్యం చెందడంపై క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సంచలన ప్రదర్శనతో, టీమిండియాలో చోటు దక్కించుకున్న ఈ బీహార్ కుర్రాడు.. ఇంగ్లాండ్ పిచ్‌లపై పరుగులు సాధించడానికి చాలా కష్టపడుతున్నాడు. బ్రిస్టల్‌లో జరిగిన నాలుగో టీ20లో ఇండియా ఓడిపోగానే కోచ్ గౌతమ్ గంభీర్ స్టేడియంలోనే వైభవ్‌తో సీరియస్‌గా మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ఇక భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ డబ్ల్యూవీ రామన్ మాట్లాడుతూ వైభవ్ ఆటపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

వైభవ్‌కి 20 మ్యాచ్‌లు ఆడే ఛాన్స్ ఇవ్వండి: రామన్
రెవ్‌స్పోర్ట్స్ (Revsportz) ఇంటర్వ్యూలో డబ్ల్యూవీ రామన్ మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ టాలెంట్‌ను కేవలం ఒకే ఒక్క సిరీస్ స్కోర్లతో అంచనా వేయడం తగదన్నారు. సెలెక్టర్లు అతనిలోని అసలైన ప్రతిభను చూసే భారత జట్టుకు ఎంపిక చేశారని, కాబట్టి ఏమాత్రం జడ్జ్ చేయకుండా అతనికి కనీసం 15 నుంచి 20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో వరుసగా అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యర్థి బౌలర్లు కొత్త ప్లేయర్స్ బలహీనతలను త్వరగా పసిగడతారని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిరంతరం అవకాశాలు ఇస్తేనే కుర్రాడికి ఆత్మవిశ్వాసం పెరిగి భవిష్యత్తులో అద్భుతాలు చేస్తాడని రామన్ ధీమా వ్యక్తం చేశారు.  

సచిన్ రికార్డ్ బ్రేక్.. జోఫ్రా ఆర్చర్ దెబ్బతో వైభవ్ విలవిల: 
ఈ నెల ప్రారంభంలో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సులో (15 ఏళ్లకే) అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలిచి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అదనపు పేస్, షార్ట్ పిచ్ బంతులతో ఈ యువ లెఫ్ట్ హ్యాండ్‌ను ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌ల్లో వైభవ్ మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లు చేయలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో 14 రన్స్, మూడో మ్యాచ్‌లో 13 పరుగులు, నాలుగో మ్యాచ్‌లో 15 రన్స్ చేసి తర్వగానే వికెట్ పారేసుకున్నాడు.

సౌతాంప్టన్‌లో కుర్రాడికి చివరి ఛాన్స్: 
వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత ఫామ్ అతడికి శాపంగా మారింది. ఈరోజు సౌతాంప్టన్ వేదికగా జరగబోయే ఆఖరి ఐదో టీ20 మ్యాచ్‌లో వైభవ్ తన తప్పులను సరిదిద్దుకుని భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గంభీర్ ఇచ్చిన క్లాస్ రూమ్ టిప్స్ పాటిస్తూ ఈ బీహార్ కుర్రాడు ఇంగ్లీష్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి మరీ.