Pawan Kalyan: పవన్ కళ్యాణ్ షోల్డర్ సర్జరీ సక్సెస్.. కోలుకుంటున్న డిప్యూటీ సీఎం

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ షోల్డర్ సర్జరీ సక్సెస్.. కోలుకుంటున్న డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కుడి భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. శనివారం (జులై 11, 2026న) ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా.దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయన కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించింది. వైద్యుల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ కుడి భుజంలో రొటేటర్ కఫ్ ఇంజ్యూరీతో పాటు అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో శస్త్రచికిత్స అవసరమైంది. దాదాపు మూడున్నర గంటల పాటు కొనసాగిన ఈ సర్జరీ విజయవంతంగా పూర్తైనట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 

వైద్యుల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ కుడి భుజంలో రొటేటర్ కఫ్ ఇంజ్యూరీతో పాటు అవల్షన్ ఫ్రాక్చర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రికవరీ రూమ్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉండగా, అనస్థీషియా ప్రభావం నుంచి కోలుకుంటున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తమ సోషల్ మీడియా వేదికగా అభిమానులు అధైర్యపడొద్దని, పవన్ కోలుకుంటున్నారని ట్వీట్ చేసింది. 

రొటేటర్ కఫ్ (Rotator Cuff) సమస్య?

భుజం సులభంగా కదలడానికి సహాయపడే కండరాలు, స్నాయువుల సముదాయాన్ని రొటేటర్ కఫ్ (Rotator Cuff)  అంటారు. ఈ భాగంలో గాయం లేదా కండరాలు చిరిగిపోతే చేతిని పైకెత్తడం కష్టమవుతుంది. తీవ్రమైన నొప్పి, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. సమస్యను ఎక్కువకాలం నిర్లక్ష్యం చేస్తే శస్త్రచికిత్స అవసరం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.