ట్రాఫిక్‌లో చిక్కుకున్న భారత జట్టు.. ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్ టాస్ ఆలస్యం!

ట్రాఫిక్‌లో చిక్కుకున్న భారత జట్టు.. ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్ టాస్ ఆలస్యం!

IND Vs ENG 5th T20I: సౌతాంప్టన్‌ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందే మైదానం వెలుపల ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రోజ్ బౌల్ స్టేడియానికి వస్తున్న భారత క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సు నగరంలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయింది. దీంతో ఆటగాళ్లు నిర్ణీత సమయానికి మైదానానికి చేరుకోలేకపోయారు. ఈ అనూహ్య పరిణామం కారణంగా షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు జరగాల్సిన టాస్ (Toss Delayed) ఆలస్యమైంది. ఇండియన్ ప్లేయర్స్ ఆలస్యంగా స్టేడియానికి చేరుకోవడంతో, మ్యాచ్ రిఫరీ జోక్యం చేసుకుని టాస్‌తో పాటు మ్యాచ్ ప్రారంభ సమయాన్ని కూడా ముందుకు జరిపారు.  

మారిన కొత్త సమయాలు ఇవే: 
భారత ఆటగాళ్లు సుదీర్ఘ ప్రయాణం తర్వాత ట్రాఫిక్‌లో అలసిపోవడం, మైదానంలోకి దిగే ముందు కనీస వార్మప్ (Warm-up) చేసుకోవడానికి సమయం కావాల్సి రావడంతో మ్యాచ్ అధికారులు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించారు. దీని ప్రకారం సాయంత్రం 6:30 కి జరగాల్సిన టాస్ ఇప్పుడు రాత్రి 7:15 గంటలకు జరగనుంది. అలాగే రాత్రి 7:00 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ హై-వోల్టేజ్ ఆఖరి పోరు కాస్త ఆలస్యంగా రాత్రి 7:30 గంటలకు (IST) జరగబోతుంది.  

శ్రేయస్ అయ్యర్ సఫరింగ్: 
ఈ సిరీస్‌లో ఇప్పటికే 3–0తో వెనుకబడి సిరీస్ చేజార్చుకున్న టీమిండియాకు, ఈ ఆఖరి మ్యాచ్ కేవలం పరువు కోపాడు కోసం మాత్రమే.. తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శ్రేయస్ అయ్యర్‌కు ఒక టీ20 మ్యాచ్‌లో కూడా విజయం దక్కలేదు. భారత్ వరుసగా చివరి 5 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలను చవిచూసింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ఇంగ్లాండ్ చేతిలో వైట్‌వాష్ (Clean Sweep) పరాభవాన్ని తప్పించుకోవాలని చూస్తుంది. అయితే మ్యాచ్‌కు ముందే ఎదురైన ఈ ట్రాఫిక్ టెన్షన్, టీమ్ ప్లానింగ్ పై ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది.