వరుసగా మూడు మ్యాచుల్లో ప్లాఫ్ షో.. ఐదో టీ20లో బుడ్డోడిపై BCCI వేటు..!

వరుసగా మూడు మ్యాచుల్లో ప్లాఫ్ షో.. ఐదో టీ20లో బుడ్డోడిపై BCCI వేటు..!

బ్రిటన్: సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్‎తో జరుగుతోన్న ఐదో టీ20లో ఇండియా టాస్ గెలిచింది. దీంతో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ నామామాత్రపు మ్యాచులో భారత్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ స్థానంలో యంగ్ ప్లేయర్ సూర్యాన్ష్ షెడ్గే జట్టులోకి వచ్చాడు. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్లేసులో స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ప్లేయింగ్ లెవన్‎లో చోటు దక్కించుకున్నాడు. 

వైభవ్ హ్యాట్రిక్ ప్లాఫ్ షో:

ఐపీఎల్ 2026లో దుమ్మురేపిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్‎కు ఎంపికైన సంగతి తెలిసిందే. కానీ జట్టు కూర్పులో భాగంగా ఐర్లాండ్‎తో జరిగిన టీ20 సిరీస్‎లో ఈ బుడ్డోడికి ఆడే అవకాశం రాలేదు. అయితే, భారత్ అనూహ్యంగా ఈ సిరీస్ కోల్పోయింది. ఐర్లాండ్ సిరీస్‎లో ఓపెనర్ సంజూ శాంసన్ దారుణంగా విఫలయ్యాడు. దీంతో జట్టు నుంచి సంజూను తప్పించి వైభవ్‎కు చాన్స్ ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి.

ఇదే సమయంలో ఇంగ్లాండ్‎తో జరిగిన తొలి టీ20లో కూడా ఈ వరల్డ్ కప్ హీరో ఫెయిల్ అయ్యాడు. దీంతో సంజూపై వేటు వేసిన బీసీసీఐ.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించింది. భారీ అంచనాలతో అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన వైభవ్ అంచనాల మేర రాణించలేదు. 

వరుసగా మూడు మ్యాచుల్లో తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వైభవ్ బలహీనతను కనిపెట్టి దెబ్బకొట్టాడు. ఇదే సమయంలో టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించిన సంజూ శాంసన్‎ను బీసీసీఐ అవమానిస్తోందని.. అతడిని జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ ప్లాఫ్ షో చేసిన బుడ్డోడిని పక్కనపెట్టి ఐదో టీ20కి సంజూ శాంసన్‎ను ఎంపిక చేసింది.