పాత పెన్షన్ పునరుద్ధరించాలి ..జన జాగరణ యాత్ర షురూ..సీపీఎస్ రద్దు చేయాలని TSCPSEU డిమాండ్

పాత పెన్షన్ పునరుద్ధరించాలి ..జన జాగరణ యాత్ర షురూ..సీపీఎస్ రద్దు చేయాలని TSCPSEU డిమాండ్

భద్రాచలం, వెలుగు: తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్​ స్కీమ్​ ఎంప్లాయీస్​ యూనియన్(టీఎస్​సీపీఎస్​ఈయూ) ఆధ్వర్యంలో సీపీఎస్​ రద్దుకు జన జాగరణ యాత్ర శనివారం భద్రాచలంలో ప్రారంభమైంది. రాముడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా అధ్యక్షుడు తుక్కాని శ్రీనివాస్​రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు బైక్​ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్​ విధానాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు.