సేమ్ డే డెలివరీలు 3 రెట్లు జంప్

సేమ్ డే డెలివరీలు 3 రెట్లు జంప్

హైదరాబాద్, వెలుగు: ఇటీవల నిర్వహించిన పదో ప్రైమ్ డే సేల్ ​సమయంలో అత్యంత వేగంగా వస్తువులను డెలివరీ చేశామని అమెజాన్​ తెలిపింది. క్విక్ ​డెలివరీ సర్వీస్ ​‘అమెజాన్ నౌ’  ద్వారా నగరాల్లో ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే సగం ఉత్పత్తులు డెలివరీ అయ్యాయి. మునుపటితో పోలిస్తే సేమ్​ డే డెలివరీలు మూడు రెట్లు పెరిగాయి.

కొత్త ప్రైమ్ మెంబర్‌‌‌‌‌‌‌‌షిప్ కొనుగోళ్లలో 70 శాతానికిపైగా వాటా చిన్న నగరాల నుంచే ఉంది. ఒక్కో ఎంఎస్​ఎంఈ రూ.10 లక్షలకుపైగా విలువైన అమ్మకాలను సాధించింది. సగానికి పైగా వినియోగదారులు అమెజాన్ పే ద్వారా చెల్లింపులు జరిపారు. దీనివల్ల అమెజాన్ పే లేటర్ వాడకం 2.5 రెట్లు పెరిగింది.   లాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లు, రోబోటిక్  వాక్యూమ్‌‌‌‌‌‌‌‌లు, స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్ల అమ్మకాలు భారీగా పెరిగాయని అమెజాన్ ​తెలిపింది.