బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎమునూరి ప్రభాకర్‌రెడ్డి(48) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దహేగాం స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అతడికి ఇటీవల హిప్ సర్జరీ(తుంటి శస్త్రచికిత్స) జరిగింది. నొప్పి కారణంగా డ్యూటీకి హాజరు కాలేకపోతున్నాడు. ఇటీవల మళ్లీ నొప్పి తిరగబెట్టడంతో భరించలేక ఈ నెల 8న కుశ్నపల్లి శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద పురుగు మందు తాగాడు. అతడిని 108లో మంచిర్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం చనిపోయాడు. మృతుడికి భార్య లక్ష్మి, పిల్లలు రిశ్విక, మౌనిక ఉన్నారు. మృతుడి సోదరుడు మల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
