ప్రేమించిన వాడు దూరమయ్యాడని యువతి ఆత్మహత్య.. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఘటన

ప్రేమించిన వాడు దూరమయ్యాడని యువతి ఆత్మహత్య.. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఘటన

లక్సెట్టిపేట, వెలుగు: ప్రేమించిన వాడు దూరమయ్యాడని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై గోపతి సురేశ్​ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం చందారం గ్రామానికి చెందిన అర్చన(21) కొంత కాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అతను నెల రోజుల కింద ఆత్మహత్య చేసుకోగా, అప్పటి నుంచి దిగాలుగా ఉంటున్న ఆమెను కుటుంబ సభ్యులు ఓదారుస్తూ వచ్చారు. శనివారం తండ్రి ఆటో నడపడానికి వెళ్లగా, తల్లి, సోదరుడు గుడికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి దూలానికి చీరతో ఉరేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.