ఫిన్లాండ్‌‌లో అదృశ్యమైన హైదరాబాద్ యువకుడు మణిదీప్ మృతి

ఫిన్లాండ్‌‌లో అదృశ్యమైన హైదరాబాద్ యువకుడు మణిదీప్ మృతి
  • 65 రోజుల తర్వాత సముద్ర ఒడ్డున డెడ్ బాడీ లభ్యం

ఎల్బీనగర్, వెలుగు: ఫిన్లాండ్‌‌లో అదృశ్యమైన హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన విద్యార్థి మణిదీప్ మృతదేహం లభ్యమైంది. దాదాపు 65 రోజుల తర్వాత సముద్ర తీరంలో అతని మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. మే 5వ తేదీన మణిదీప్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి ఫిన్లాండ్ పోలీసులు, స్థానిక అధికారులు అతని కోసం గాలించారు.

ఈ క్రమంలో జులై 9న క్రూనువు ఒరెన్‌‌రంటా సముద్ర తీరంలో ఒక మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ మృతదేహాన్ని నిశితంగా పరిశీలించిన అధికారులు.. అది అదృశ్యమైన మణిదీప్‌‌దేనని ధృవీకరించారు. అతని మృతికి గల అసలు కారణాలపై ఫిన్లాండ్ జాతీయ దర్యాప్తు బ్యూరో ప్రస్తుతంన ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తోంది.  కాగా.. మణిదీప్ మరణవార్త వినడంతో వనస్థలిపురంలోని అతని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఏకంగా 65 రోజుల పాటు సముద్రంలో ఉన్న మృతదేహం ఇప్పుడు లభించడం పలు అనుమానాలకు తావిస్తోందని పేరెంట్స్​, బంధువులు అంటున్నారు.