డీమార్ట్కు సండే షాపింగ్కు పోతున్నారా..? మీ వల్ల ఎంత లాభపడిందో తెలుసా..?

డీమార్ట్కు సండే షాపింగ్కు పోతున్నారా..? మీ వల్ల ఎంత లాభపడిందో తెలుసా..?
  • 11 శాతం పెరిగిన డీమార్ట్ లాభం.. జూన్​ క్వార్టర్లో రూ.860.44 కోట్లు

న్యూఢిల్లీ: డీమార్ట్​ పేరుతో హైపర్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లు నిర్వహించే అవెన్యూ సూపర్‌‌‌‌‌‌‌‌మార్ట్స్ లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో 11.33 శాతం వృద్ధితో రూ.860.44 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో కంపెనీ నికర లాభం రూ.772.81 కోట్లు ఉంది. ఆదాయం 14.9 శాతం పెరిగి రూ.18,794.53 కోట్లకు చేరుకుంది. మొత్తం ఖర్చులు 15.11 శాతం పెరిగి రూ.17,637.17 కోట్లుగా నమోదయ్యాయి.

ఈ క్వార్టర్లో డీమార్ట్​ కొత్తగా 3 స్టోర్లను ప్రారంభించడంతో మొత్తం స్టోర్ల సంఖ్య 503 కు చేరింది. ఆన్‌ ‌‌‌‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ డీమార్ట్ రెడీ వ్యాపారాన్ని తక్కువ ఆదాయం ఉన్న ఏడు నగరాల్లో నిలిపివేసింది. ప్రస్తుతం డీమార్ట్ రెడీ 11 నగరాల్లో సేవలు అందిస్తోంది. రాధాకిషన్ దమానీ కుటుంబం ప్రమోట్ చేస్తున్న ఈ సంస్థ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తోంది.