కల్లూరు, వెలుగు: సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదలైన గోదావరి జలాలు శనివారం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కప్పల బంధం రెగ్యులేటర్ కు చేరుకోవడంతో రైతులు, కాంగ్రెస్ నాయకులు పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య గోదావరి జలాలకు పూజలు చేసి హారతులిచ్చారు.
గోదావరి జలాలు రావడం పట్ల నేతలు పసుమర్తి చందర్రావు, పోట్రు అర్జున్ రావు, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి ప్రభాకర్ చౌదరి, కల్లూరు మున్సిపల్ చైర్పర్సన్ ధారావత్ మోహన్ నాయక్, షేక్ ఉస్మాన్, జాస్తి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు.
