- టీఆర్ఎస్ చీఫ్ కవిత
సత్తుపల్లి, వెలుగు: సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కార్మికుల హక్కులను కాలరాస్తూ శ్రమను దోచుకుంటున్నాయని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బాయిబాట కార్యక్రమం చేపట్టారు. అనుచరులతో కలిసి మైన్లోకి వెళ్లేందుకు యత్నించగా అనుమతి లేదంటూ గేట్ లను మూసివేశారు. దీంతో కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది. గేట్ తాళాలను పగలగొట్టి లోనికి వెళ్లారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ హెచ్ఎంఎస్ యూనియన్ నిజాలు బయటపెడుతుందనే భయంతో సింగరేణి యాజమాన్యం పోలీసులు సెక్యూరిటీ పెట్టి అడ్డుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఎర్ర జెండా కప్పుకున్న కొన్ని యూనియన్లు యాజమాన్యానికి సపోర్ట్ చేయడం సిగ్గు చేటన్నారు. సింగరేణి కార్మికులకు ఇప్పటి వరకు వెల్ఫేర్ డెవలప్మెంట్ కూడా లేదన్నారు. సత్తుపల్లిలో కొత్త గా వచ్చే గనులను సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు. రెండు బెడ్లతో సింగరేణి హాస్పిటల్ ను నడపడం సరైంది కాదన్నారు. సింగరేణి కార్మికుల హక్కులను కాలరాస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, కార్మికుల హక్కుల కోసం హెచ్ఎంఎస్ అండగా ఉంటుందని తెలిపారు.
